మే 2న అమరావతికి రానున్న మోదీ
ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. అమరావతి నిర్మాణాల పునఃప్రారంభోత్సవానికి ప్రధాని హాజరుకానున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారయింది. మే 2వ తేదీ అమరావతికి మోదీ రానున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను మోదీ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వెనుక బహిరంగసభ వేదికను ఏర్పాటు చేయనున్నారు. ఈ వేదిక నుంచే పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మోదీ నిర్వహించనున్నారు. భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించారు. ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఖరారు..
RELATED ARTICLES