Saturday, April 19, 2025
Homeజాతీయంవాహనదారులకు శుభవార్త..ఇకపై ప్రయాణించిన దూరానికే టోల్ చార్జి

వాహనదారులకు శుభవార్త..ఇకపై ప్రయాణించిన దూరానికే టోల్ చార్జి

టోల్ రోడ్లపై ప్రయాణించే వాహనదారులకు ఇది శుభవార్తే. ఇప్పటి వరకు ప్రయాణ దూరంతో సంబంధం లేకుండా టోల్ చార్జీలు వసూలు చేస్తుండగా, ఇకపై ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ చెల్లించేలా కొత్త విధానం అమల్లోకి రాబోతోంది. టోల్ గేట్ల వద్ద నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (జీఎన్ఎస్ఎస్) ఆధారిత విధానం మే 1 నుంచి అమల్లోకి రానుంది. తొలుత వాణిజ్య వాహనాలకు, 2027 నుంచి వ్యక్తిగత వాహనాలకు అమలు చేయనున్నారు. అప్పటి వరకు మాత్రం టోల్ గేట్లు కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది.

సాధారణంగా మన ఫోన్లలో ఉండే జీపీఎస్ విధానానికి ఈ జీఎన్ఎస్ఎస్ పూర్తిగా భిన్నం. జీపీఎస్ అనేది ఒకే ఒక్క శాటిలైట్ నేవిగేషన్ వ్యవస్థ. కానీ జీఎన్ఎస్ఎస్ అనేది పలు దేశాలకు చెందిన నేవిగేషన్ ఉపగ్రహాలతో అనుసంధానమవుతుంది. రష్యాకు చెందిన గ్లోనాస్, యూరప్‌కు చెందిన గెలీలియో, చైనాకు చెందిన బైదు, భారత్‌కు చెందిన గగన్, నావిక్ తదితర నావిగేషన్ వ్యవస్థలు ఉన్నాయి. ఈ వేర్వేరు ఉపగ్రహాలకు ఒకేసారి అనుసంధానమై అత్యంత కచ్చితమైన లొకేషన్ గుర్తింపుతోపాటు నావిగేషన్ పొందే విధానమే జీఎన్ఎస్ఎస్.

ఈ విధానం అమల్లోకి వస్తే వాహనాలు ఏయే రోడ్లపై ఎంతదూరం ప్రయాణించాయన్నది కచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ విధానంలో టోలు అమలు చేసేందుకు బస్సులు, లారీలు, ట్రక్కులు, కార్లు తదితర టోల్ వర్తించే వాహనాల్లో వోయూబీగా పిలిచే ఆన్‌బోర్డు యూనిట్లను బిగించుకోవాల్సి ఉంటుంది. అది శాటిలైట్లకు అనుసంధానమై వాహన వివరాలను నమోదు చేస్తుంది. ఆ మేరకు టోల్ చార్జీల సొమ్ము మన ఖాతా నుంచి కట్ అవుతుంది. ఈ వోయూబీ రూ. 4 వేల వరకు ఉంటుందని సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు