ఈరోజు, రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
కొన్ని జిల్లాల్లో వడగళ్ల వానలు పడే అవకాశం ఉందన్న ఐఎండీ
ఒకవైపు ఎండలు దంచి కొడుతుంటే.. మరోవైపు అక్కడక్కడా వానలు పడుతుండటం వేసవి తాపంలో జనాలకు ఉపశమనం కలిగిస్తోంది. ఈ క్రమంలో ఈరోజు, రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ మరోసారి చల్లని కబురు చెప్పింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అలాగే కొన్ని జిల్లాల్లో వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. నేడు తెలంగాణలోని సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, కరీంనగర్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, నాగర్‌కర్నూల్, కొమురంభీమ్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి, అన్నమయ్య, పార్వతిపురం మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, శ్రీసత్యసాయి, ఏలూరు, తూర్పుగోదావరి, వైఎస్ఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) కూడా తీర ప్రాంతాల్లో అధిక ఆటుపోట్లు ఉండవచ్చని, మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది.
ఏపీ, తెలంగాణకు వర్ష సూచన
RELATED ARTICLES