పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని నాగులూరు గ్రామం వద్ద గల
రూపా రాజా పి సీ ఎంఆర్ పాఠశాలలో ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ స్కూల్ నుండి ప్రైమరీ స్కూలుకు విద్యార్థులు మారే రోజున ఈ గ్రాడ్యుయేషన్ వేడుక జరుపుకుంటారు అని తెలిపారు. విద్యార్థులు ఈ సంవత్సరం కలిసి చేసిన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జ్ఞాపకాలతో గడుపుతారని తెలిపారు. ప్రీ ప్రైమరీ పిల్లలను సైతం ఆటలు, పాటలు, మాటల్లో తర్పీదు ఇవ్వాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తదుపరి ప్రీఫైనరీ విద్యార్థులలో ప్రతిభ ఘనపరిచిన విద్యార్థులకు చైర్మన్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ రూప రాజా కృష్ణ, జగదీష్, కరస్పాండెంట్ నాగమోహన్ రెడ్డి, ప్రిన్సిపల్ నరేష్ కుమార్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ వేడుకలు
RELATED ARTICLES