ఇద్దరు అరెస్ట్..
విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని రేగాటిపల్లి వద్ద మార్చి నెల 16న జరిగిన అక్కమ్మ హత్య కేసును రూరల్ పోలీసులు ఒక్క నెలలో నే కేసు చేదించారు. ఈ సందర్భంగా రూరల్ పోలీస్ స్టేషన్లో నిందితుల అరెస్టు వివరాలను సీఐ ప్రభాకర్ వెల్లడించారు. అనంతరం వారు మాట్లాడుతూ మార్చి 16న ధర్మవరం కళాజ్యోతి కూడలి వద్ద ఉన్న అక్కమను ఆటో డ్రైవర్లు శిక్షావలి లోకేంద్ర ఆటోలో ఎక్కించుకొని రేగాటిపల్లి పొలాల్లోకి తీసుకొని వెళ్లడం జరిగిందన్నారు. అక్కడ అక్కమ్మకు లోకేంద్రకు గొడవ కొనసాగిందని తెలిపారు. తదుపరి శిక్షావలి సహాయంతో అక్కమ్మ తలపై రాయితో బలంగా కొట్టడం జరిగిందన్నారు. తదుపరి తెరవద్ద ఉన్న చాకుతో గొంతు కోసి హతమార్చడం జరిగిందని తెలిపారు. నిందితులైన ధర్మవరం ఎల్ – 2 కాలనీకి చెందిన తలారి లోకేంద్ర, శాంతినగర్ వాసి శిక్షావలిని మండలంలోని సీతారామ పల్లి జాతీయ రహదారి వద్ద అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. వీరి ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్కు పంపడం జరిగిందని తెలిపారు. మహిళా హత్య కేసును త్వరితగతిన ఛేదించినందుకు కృషి చేసిన సీఐ ప్రభాకర్, ఎస్ఐ. శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ శత్రు నాయక్, రామాంజనేయులు, కానిస్టేబుల్ బాబాజాన్, రాజప్ప, షాకీర్, అనిల్ కుమార్, రాజేంద్ర, బాలకృష్ణ పోలీసులను జిల్లా ఎస్పీ రత్న డిఎస్పి హేమంత్ కుమార్, అభినందించారు.
మహిళా హత్య కేసును ఛేదించిన రూరల్ పోలీసులు
RELATED ARTICLES