విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని మహాత్మా గాంధీ నగర్ లో అనారోగ్యంతో బాధపడుతున్న వడ్డే శ్రీనివాస్ కుటుంబానికి ధర్మవరం రిటైర్డ్ ఉద్యోగ సంఘం అధ్యక్షులు చలపతి, ఉపాధ్యక్షులు శ్రీరాములు, కార్యదర్శి శివలింగన్న, కోశాధికారి సుధాకర్ తమ వంతుగా 2500 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటువంటి కుటుంబాలకు ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయం అందించి మానవతా విలువలు పెంచేలా సహకరించాలని తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులు రిటైర్డ్ ఉద్యోగ సంఘం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన రిటైర్డ్ ఉద్యోగుల సంఘం
RELATED ARTICLES