Saturday, April 19, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆకట్టుకున్న నాట్య ప్రదర్శన

ఆకట్టుకున్న నాట్య ప్రదర్శన

నాట్య గురువులు బాబు బాలాజీ
విశాలాంధ్ర ధర్మవరం; శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని గుడిపల్లి సబ్జా గంటా రంగనాథ స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా, ధర్మవరం పట్టణంలోని శ్రీ లలితా నాట్య కళానికేతన్ నాట్య గురువులు బాబు బాలాజీ, కమలా బాలాజీ, రామ లాలిత్య తోపాటు పదిమంది చిన్నారులు చేసిన నాట్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. స్వామివారి సన్నిధిలో అన్నమయ్య సంకీర్తనలకు నాట్యములు నిర్వహించారు. అదేవిధంగా రామరాళిత్య చేసిన రామాయణం నృత్య రూపకం అందరినీ అలరించింది. తదుపరి ఆలయ ధర్మకర్త రమాకాంత్ రెడ్డి నిర్వాహకులు, రంగాచార్యులు కలసి గురువులను నాట్య కళాకారులను సన్మానించి జ్ఞాపికలు, సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం గురువులు మాట్లాడుతూ ఇటువంటి అవకాశం మాకు రావడం ఎంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు