Saturday, April 19, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికుటుంబ సాధికారిక సారధి ప్రక్రియను వెంటనే పూర్తి చేయండి..

కుటుంబ సాధికారిక సారధి ప్రక్రియను వెంటనే పూర్తి చేయండి..

మరో ముగ్గురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన నియోజకవర్గ అబ్జర్వర్
విశాలాంధ్ర ధర్మవరం ; ధర్మవరం నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ నేతృత్వంలో నియామకం జరుగుతున్న కుటుంబ సాధికారిక సారథి ఎంపిక పక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ధర్మవరం నియోజకవర్గ అబ్జర్వర్ నాగేంద్రప్రసాద్ తెలిపారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలుమేరకు ధర్మవరం నియోజకవర్గ అబ్జర్వర్ నాగేంద్రప్రసాద్ పట్టణ తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో తెదేపా నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో ఏ స్థాయిలో పదవులు పొందాలన్నా అదేవిధంగా నామినేటెడ్ పదవులు పొందాలన్నా కచ్చితంగా కుటుంబ సాధికారిక సారథిగానమోదు అయి ఉండాలని తెలిపారు. అదేవిధంగా ఈనెల 24వ తారీఖు లోపల కుటుంబ సాధికారిక సారధి పక్రియను ధర్మవరం నియోజకవర్గంలో పూర్తిచేయాలని తెలిపారు. అనంతరం గ్రామ,వార్డు, మండల,నియోజకవర్గ, పార్లమెంటు,రాష్ట్ర స్థాయిలో కమిటీలు వేయడం జరుగుతుందని, పార్టీకి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పార్టీ కమిటీ లలోను,నామినేట్ పదవుల్లోనూ అవకాశం లభిస్తుందని వారు తెలిపారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ;;
అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రులలో పలు వ్యాధులతో చికిత్స పొందిన ముగ్గురికి రూ”లు 94,398 విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను నాగేంద్రప్రసాద్ పంపిణీ చేశారు. ఈసందర్భంగా నియోజకవర్గ అబ్జర్వర్ నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఎంతోమంది అభాగ్యులు సకాలంలో చికిత్స పొందలేక ప్రైవేట్ ఆస్పత్రిలలో అప్పులు చేసి , ఖర్చు పెట్టుకున్న బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా ఉందని ఆయన అన్నారు. పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గ క్లస్టర్ ఇంచార్జ్ చింతలపల్లిమహేష్ చౌదరి,రాష్ట్ర కార్యదర్శి, సీడ్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కమతం కాటమయ్య,పట్టణ అధ్యక్షులు పరిసే సుధాకర్, రూరల్ అధ్యక్షుడు లక్ష్మన్న, ముదిగుబ్బ మండల నాయకుడు తుమ్మల మనోహర,తెదేపా సీనియర్ నాయకులు ఫణికుమార్, రాళ్లపల్లి షరీఫ్, మాజీ జడ్పిటిసి రామాంజనేయులు, పెద్దన్న,శ్రీనివాసులు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు