విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని అవోపా యూనిట్ కార్యాలయము, విజయలక్ష్మి ఆయుర్వేద క్లినిక్ లో నూతన కమిటీ ఎంపిక జరిగింది. ఈ కమిటీలో నూతన అధ్యక్షునిగా ఇనుగూరు సుజన్ కుమార్ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అనంతరం శ్రీ సత్య సాయి జిల్లా ఇన్చార్జ్ అన్నా లక్ష్మీనారాయణ ,ధర్మవరం యూనిట్ అధ్యక్షులు డాక్టర్ సిబా నగేష్ గుప్తా మాట్లాడుతూ అవోపా కమిటీ అభివృద్ధికి నూతన అధ్యక్షులు కృషి ఎంతో అవసరం ఉందని తెలిపారు. ఈ కమిటీ 2025-2027 వరకు కొనసాగుతుందని తెలిపారు. తదుపరి విలువైన వ్యక్తిగత సలహాలను ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకుమాను హరి, ఓవి. ప్రసాద్, జిఎస్టి అకౌంటెంట్ ప్రసాద్, ఫార్మసిస్ట్ భాస్కర్, హేమంత్ కుమార్, డాక్టర్ వేణుగోపాల్, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
నూతన అఓపా అధ్యక్షునిగా ఇనుగూరు సుజన్ కుమార్
RELATED ARTICLES