ముంబై: ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు తాజా సమావేశంలో, గ్లోబల్ గ్రోత్ ఇన్వెస్టర్ వార్‌బర్గ్ పింకస్ ఎల్‌ఎల్ సి అనుబంధ సంస్థ అయిన కరెంట్ సీ ఇన్వెస్ట్‌మెంట్స్ బి .వి .కి సుమారు రూ. 4,876 కోట్ల విలువైన ఈక్విటీ క్యాపిటల్ (సిసిపిఎస్) ప్రిఫరెన్షియల్ ఇష్యూను, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ఏడిఐఏ) పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన ప్లాటినం ఇన్విక్టస్ బి 2025 ఆర్‌ఎస్‌సీ లిమిటెడ్‌కు సుమారు రూ. 2,624 కోట్లు విలువైన ఈక్విటీ క్యాపిటల్ (సిసిపిఎస్) ప్రిఫరెన్షియల్ ఇష్యూను జారీ చేయడానికి ఆమోదించింది. ప్రతిపాదిత ఇష్యూలు వాటాదారులు మరియు నియంత్రణ ఆమోదాలకు లోబడి ఉంటాయి. ఈ సమయంలో, డిపాజిట్లు 6 రెట్లు పెరిగాయి, రుణాలు , అడ్వాన్సులు రెట్టింపు అయ్యాయి. కాసా నిష్పత్తి 8.7% నుండి 47.7%కి గణనీయంగా మెరుగుపడిరది.