Saturday, April 19, 2025
Homeజాతీయంభారత అమ్ముల పొదిలోకి కొత్తగా మరో శక్తిమంతమైన అస్త్రం..ధ్వని

భారత అమ్ముల పొదిలోకి కొత్తగా మరో శక్తిమంతమైన అస్త్రం..ధ్వని

ఉత్తర అమెరికాలోని లక్ష్యాలను సైతం ఛేదించే సామర్థ్యం
భారత అమ్ముల పొదిలోకి కొత్తగా మరో శక్తిమంతమైన అస్త్రం వచ్చి చేరింది. దాని పేరు ధ్వని. హైపర్‌సానిక్ గ్లైడ్ వెహికల్ (హెచ్‌జీవీ) అయిన ఈ క్షిపణి ఇప్పటికే ఉన్న అగ్ని-5ను మించి ఉంటుందని సమాచారం. అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి రేంజ్ 5,500 కిలోమీటర్లు కాగా, ధ్వని రేంజ్ 6 నుంచి 10 వేల కిలోమీటర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ క్షిపణిని మన లాంచ్ సైట్ల నుంచి ప్రయోగించి ఆసియా, యూరప్‌తోపాటు ఉత్తర అమెరికాలోని కొన్ని భాగాల్లోని లక్ష్యాలను తుత్తినియలు చేయొచ్చు. 29.5 మీటర్ల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉండే ఈ క్షిపణి ప్రయాణించే తీరు కూడా ప్రత్యేకంగా ఉంటుందని దీనిని అభివృద్ధి చేసిన డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తొలుత బాలిస్టిక్ బూస్ట్ దశ, తర్వాత ఎక్స్‌టెండెంట్ గ్లైడ్ దశతో హైపర్‌సానిక్ వేగంతో ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు, గాల్లో ఉండగానే దిశను సైతం మార్చుకోగలిగే సామర్థ్యం ఉండే హెచ్‌జీవీలను సంప్రదాయ క్షిపణి రక్షణ వ్యవస్థలతో అడ్డుకోవడం దాదాపు అసాధ్యమని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు