Saturday, April 19, 2025
Homeజిల్లాలునెల్లూరుపౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం.. సూపర్వైజర్ సునీత

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం.. సూపర్వైజర్ సునీత

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : చిన్నారులు, బాలింతలు గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా నే సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉంటారని అంగన్వాడీ సూపర్వైజర్ సునీత అన్నారు. శనివారం వలేటివారిపాలెం మండలంలో సీడీపీఓ శర్మిష్ట సూచనల మేరకు సూపర్వైజర్ సునీత అధ్యక్షతన బడేవారిపాలెం గ్రామంలో పౌష్టికాహర పక్షోత్సవాలు సందర్భంగా గర్భవతులకి, బాలింతలకి, 6నుండి 3 సంవత్సరంల పిల్లలకు,తల్లులకి పౌష్టికాహారం పై అవగాహన, మరియు స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర లో ఈ మంత్ థీమ్ అయినటువంటి స్వచ్ఛత పై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడం పై అవగాహన కల్పించడం జరిగినది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల లబ్ధిదారులు సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా పోషణ్ పక్వాడ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆకు కూరలు, చిరుదాన్యాలలో పోషకాలు అధికంగా ఉంటాయని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ ఎం.మాలకొండయ్య, ఏ ఎన్ ఎం లావణ్య, సూపెర్వైజర్ సునీత , అంగన్వాడీ కార్యకర్తలు రమ, రాధ, మనోహర, భారతి ఆశ లు, గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు