రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం;; హక్కుల సాధనం కోసం బీసీలు అందరూ ఐక్యతను చాటుకోవాలని, అప్పుడే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పోలా ఫంక్షన్ హాల్ లో మహిళ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులైన సంకారపు జయశ్రీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి, రాష్ట్రంలో బిసి సంఘము యొక్క ప్రాధాన్యతను వారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రితోపాటు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు, విశ్రాంత ఐపీఎస్ ఆఫీసర్ చిరంజీవి, జిల్లా అధ్యక్షులు నామాల శంకర్, రాష్ట్ర నాయకులు క్రాంతి కుమార్, ఏపీ స్వీట్స్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ కమాతం కాటమయ్య, టిడిపి పట్టణ అధ్యక్షుడు పరీక్ష సుధాకర్ తదితరులు హాజరు కావడం జరిగింది. తొలుత జ్యోతి ప్రజలను చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హక్కులపై పోరాట ప్రతిభను చైతన్య పరచాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉందని తెలిపారు. ఐక్యంగా ఉన్నప్పుడే ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి సంఖ్యాబలం పెంచుకునే అవకాశం ఉంటుంది అని వారు స్పష్టం చేశారు. చట్టసభల్లో బీసీల గురించి ప్రస్తావించిన మహనీయుడు కీర్తిశేషులు నందమూరి తారకరామారావు అని వారు గుర్తు చేశారు. బీసీ సబ్ ప్లాన్ నిధులను పక్కదార పట్టించింది వైసిపి ప్రభుత్వమేనని వారు దుయ్యబట్టారు. బీసీల పిల్లలను సాధ్యమైనంత వరకు ఉన్నత చదువులు చదివించాలని అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అంతేకాకుండా బీసీలు రాజకీయాల్లో రాణించాలని వారు పిలుపునిచ్చారు. ఇలాంటి సభలు అప్పుడప్పుడు నిర్వహించి బీసీ సంఘం ఐక్యతను చాటాలని తెలిపారు. రాష్ట్ర బీసీ సంఘం మహిళ అధ్యక్షురాలుగా సంకారపు జయ శ్రీ ఎంపిక కావడం సంతోషిస్తూ వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ కీర్తిశేషులు ఎన్టీ రామారావు 33 శాతము రిజర్వేషన్ కల్పించిన ఘనత వారిదే అని తెలిపారు. పోరాటాలు కొద్దికొద్దిగా ఆత్మస్థైర్యాన్ని ఇస్తాయని తెలిపారు. బీసీలంతా ఏకమైతే నే ఏ సమస్యనైనా తప్పక సాధించుకోగలుగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గిర్రాజరవి, పోలా ప్రభాకర్, డాక్టర్ వివేక్ కుల్లాయప్ప, గుడ్డు మరి ఆదినారాయణ యాదవ్ ముత్తుకూరు బీబీ, నాగూర్ హుస్సేన్ తో పాటు వందలాదిమంది నియోజకవర్గము నుండి రాష్ట్ర నుండి బీసీ సంఘం నాయకులు, కుల బాంధవులు పాల్గొన్నారు.
హక్కుల సాధనం కోసం బీసీలు ఐక్యతను చాటుకోవాలి..
RELATED ARTICLES