డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు పిలుపు
విశాలాంధ్ర -శెట్టూరు (అనంతపురం జిల్లా) : స్వర్ణాంధ్ర స్వచ్ఛ్ ఆంధ్ర లో భాగంగా శనివారం శెట్టూరు మండల కేంద్రంలో జడ్పీ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీనివాసరావు హాజరయ్యారు వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల మూడవ శనివారాన్ని స్వచ్ఛ్ ఆంధ్ర – స్వర్ణాంధ్ర విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేపిచ్చారు మన పాఠశాలను నిరంతరం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదేవిధంగా మన ఇంటి చుట్టూ ఉన్న వ్యక్త పదార్థాలు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా గ్రామంలో పనిచేస్తున్న స్వచ్ఛ పారిశుద్ధకు కార్మికుల ద్వారా చెత్తని వేలని విద్యార్థులకు సచించారు అనంతరం పాఠశాల ఆవరణ నందు మొక్కల నాటి వాటికి నీరు పోసి మొక్కలు చనిపోకుండా బాధితంగా చూసుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుమార్, ఎంఈఓ వాణి దేవి , ఉపాధ్యాయుడు ఫిరోజ్ ఖాన్ , దివాకర్ రెడ్డి,రవిశంకర్, జెబి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు