Saturday, April 19, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికె.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇ-వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వాహణ కార్యక్రమము..

కె.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇ-వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వాహణ కార్యక్రమము..

వైస్ ప్రిన్సిపాల్ చిట్టెమ్మ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని స్థానిక కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ” ఈ-వ్యర్థాల నిర్వహణ కార్యక్రమం”ను ఎన్.ఎస్.ఎస్. యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. బి. గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో కళాశాల వైస్-ప్రిన్సిపాల్, డాక్టర్ ఎస్. చిట్టెమ్మ అధ్యక్షతన నిర్వహించడo జరిగింది. వైస్ ప్రిన్సిపాల్ డా. ఎస్. చిట్టెమ్మ మాట్లాడుతూ ఆధునిక భారత దేశంలో శాస్త్ర సాంకేతిక రంగం లో ప్రపంచదేశాలతో పోటిపడుతుందని తెలిపారు. వాటినుండి వచ్చే వ్యర్థాల నిర్వహణను మనం ప్రతి ఒక్కరు వాటిని ఏవిధంగా తొలగించి ఎక్కడకు పారవేయలని అవగాహనను కల్గివుండి, వాటి నుండి మనకు కలిగే దుష్పరిణమాలను ముందే గ్రహించి పర్యవరణ సమతుల్యతను పాటించాలని తెలియచేసారు. అనంతరo డాక్టర్ బి. గోపాల్ నాయక్ మాట్లాడుతూ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రపంచ పర్యావరణ శాఖ అధ్వర్యంలోని నినాదం “ప్రపంచవ్యాప్తంగా ఆలోచించండి , స్థానికంగా వ్యవహరించండి” (థింక్ గ్లోబల్లి అండ్ ఆక్ట్ లోకల్లి) ను గుర్తుచేసుకోని. పర్యావరణ హానిని తగ్గించడానికి, విలువైన పదార్థాలను తిరిగి పొందటానికి సేకరణ, సార్టింగ్, రీసైక్లింగ్, సురక్షితమైన పారవేయడం వంటి విస్మరించిన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాలను బాధ్యతాయుతంగా నిర్వహించే ప్రక్రియను ఇ-వేస్ట్ మేనేజ్‌మెంట్ లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అని తెలియజేశారు.
పర్యవరణాన్ని కాపాడుకొనే బాధ్యత ప్రతిఒక్కరి పై వుందని తెలిపారు. అనంతరం స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్, డా ఎస్. చిట్టెమ్మ, ఎ. కిరణ్ కుమార్, ,డా.బి.త్రివేణి, డా ఎస్. షమీఉల్లా, ఎస్.పావని, ఎం.భువనేశ్వరి, వి.హైమావతి ,ఎం. పుష్ప, టి.సరస్వతి, బి . ఆనంద్, జి.మీనా, జి. ధనుంజయ, ఎస్. సరస్వతి మరియు బి.నల్లమ్మ…. తదితర అధ్యాపక , అధ్యాపకేతర సిబ్బంది ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు