సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్
విశాలాంధ్ర ధర్మవరం; భారత రాజ్యాంగానికి విరుద్ధంగా, లౌకిక రాజ్య ఆశయానికి తూట్లు పొడుస్తూ బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ – 2025 తక్షణమే రద్దు చేయాలని, ధర్మవరం లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ముస్లిం సోదరులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం ను సిపిఐ నాయకులు తెలిపారు. అనంతరం రవికుమార్ మాటలాడుతూ ఈ బిజెపి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే ప్రజల అభివృద్ధి మీద దృష్టి సాధించి ,ప్రజల సమస్యలు తీర్చే విధంగా పనిచేయాలని, అంతేగాని కులాలు కి మతాలకి చిచ్చుపెట్టే విధంగా రాజకీయాలు చేస్తే మాత్రం సహించేది లేదని ముస్లిం సోదరులకు న్యాయం జరిగేంత వరకు భారత కమ్యూనిస్టు పార్టీ గా వారి పోరాటాల్లో పాల్గొని నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ, చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడగ వెంకటనారాయణ, చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గుర్రం వెంకటస్వామి, ఆదినారాయణ,మహిళా సమైక్య తరఫున లలితమ్మ, లింగమ్మ, ఈరమ్మ, ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, గోవిందరాజులు, లక్ష్మీనారాయణ, ఆర్గనైజేషన్ కార్యదర్శి ఆంజనేయులు, తాజుద్దీన్, రామకృష్ణ, సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.
వక్ఫ్ బోర్డు నూతన సవరణ చట్టం వెంటనే రద్దు చేయాలి
RELATED ARTICLES