విజేతలకు ఘన సన్మానం
భవిష్యత్‌లో ఇంకా గొప్ప అవకాశాలు కల్పిస్తానన్న మంత్రి సత్యకుమార్ యాదవ్.
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయం లో ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్య కుమార్ ధర్మవరం శ్రీ లలిత నాట్య కళా నికేతన్ నాట్య గురువులు బాబు బాలాజీ, కమల బాలాజీ రామ లాలిత్య శిష్య బృందం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం లో 2023 లో జరిగిన కూచిపూడి మహా బృంద నాట్యం లో పాల్గొని గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించిన 12 మందికి మంత్రి వారి చేతుల మీదుగా అందరికి గిన్నీస్ సర్టిఫికెట్స్, మెడల్స్,అందచేసి శాలువాలు కప్పి అందరినీ సన్మానించారు.గురువు బాబు బాలాజీ నీ వారి కృషిని కొనియాడారు.12 మంది వారి సమక్షం లో కూచిపూడి ఝానుత శబ్దం అనే నాట్యాన్ని ప్రదర్శించారు.నాట్యం చేసిన కళాకారులను ఎంతగానో ప్రశంసించారు.మీ వల్ల ధర్మవరం నియోజక వర్గం కి మంచి పేరు,గుర్తింపు వచ్చిందని ప్రశంసించి,భవిష్యత్తు లో ఇంకా మంచి అవకాశాలు కల్పిస్తానని ఆశీర్వదించారు.ఇంతటి మహా అవకాశం ఇచ్చి తమ శిష్యులను సన్మానించి నందుకు గురువు బాబు బాలాజీ, రామ లాలిత్య తమ ఆనందాన్ని ,మంత్రిగారికి ధన్యవాదములు తెలియ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, మార్కెట్ యార్డ్ చైర్మన్ అంబటి అరుణశ్రీ, పట్టణ అధ్యక్షులు జింక చంద్రశేఖర్, రూరల్ అధ్యక్షులు చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు సాకే ఓబ్లేస్, అంబటి సతీష్, గిర్రాజ్ నగేష్, మైనార్టీ నాయకులు కృష్ణాపురం జమీర్, వీర నారప్ప, చిగిచెర్ల ఓబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.