Monday, April 21, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు..

ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు..

అగ్నిమాపక అధికారి యు. రాజు
విశాలాంధ్ర ధర్మవరం:; అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అగ్నిమాపక ప్రమాదాలు వాటి నివారణ పై పట్టణంలోని పలుచోట్ల అవగాహన కల్పించడం జరిగిందని, అగ్నిమాపక అధికారి యు. రాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 14 నుండి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అగ్ని ప్రమాదాల నివారణ పై ప్రజలందరికీ అవగాహన కల్పించడం మాకు ఎంతో సంతోషంగా ఉందని వారు స్పష్టం చేశారు.పాఠశాలలు, కళాశాలలు, పెట్రోల్ బంకు, ఇతర ప్రైవేట్ ఇండస్ట్రీల వద్ద అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు నివారించే పద్ధతులను డెమో ద్వారా వివరించడం జరిగిందన్నారు.అదేవిధంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని ఆర్పే విధానం కూడా ప్రదర్శన ద్వారా చూపించడం జరిగింది అన్నారు. అనంతరం ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. చివరి రోజున అగ్నిమాపక కార్యాలయంలో అగ్నిమాపక పరికరముల ప్రదర్శన,వాటిని అగ్ని ప్రమాదంలో విపత్తు సమయములలో ఎలా ఉపయోగించాలి అనే దాని పైన ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది , అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు