టిడిపి నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ సందర్భంగా రాష్ట్ర నాయకులు,పట్టన నాయకులు తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులు కలిసి జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా లక్ష్మీ చెన్నకేశవ స్వామి గుడిలో నారా చంద్రబాబు నాయుడు పేరు మీద అర్చన, పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ హాస్పటల్ లో బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. తదుపరి అనంతరం తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. తదుపరి తెలుగు దేశం పార్టీ ఆఫీసు దగ్గర, కదిరి గేట్ దగ్గర, ప్రభుత్వ హాస్పటల్ దగ్గర గల అన్నక్యాటిన్ దగ్గర స్థానిక ప్రజలకు అన్నదానం చేయడం పెద్ద ఎత్తున జరిపించారు.ఈ సందర్బంగా తెలుగు దేశం పార్టీ నాయకులు కమతం కాటమయ్య, పని కుమార్ సంధ రాఘవ పరిసే సుధాకర్, మహేష్ చౌదరి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపిన గొప్ప దార్శనికుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజల సేవే ఆయనకు పరమాధిక్యమని పేర్కొన్నారు. పాలనలో పారదర్శకత, అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చే విధానాలే వారి లక్ష్యమని అన్నారు. వారి అనుభవం, విజన్‌తో ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించేందుకు ఆయన కట్టుబడి ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ముక్తకంఠముతో తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు జింక రామాంజనేయులు, మద్దిలేటి, కొత్తపేట ఆది ,నాగురు హుస్సేన్, రాళ్లపల్లి షరీఫ్ ,జింకల రాజన్న, మారుతి స్వామి, బొట్టు కృష్ణ, సాయి కృష్ణ తోపాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ధర్మవరంలో ఘనంగా నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
RELATED ARTICLES