Monday, April 21, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని 32 వ వార్డు గిర్రాజు కాలనీకి చెందిన చేనేత కార్మికుడు బీరే నాగరాజు బెంగళూరు వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యమంలో గుండెపోటుతో మృతి చెందిన జరిగింది. సమాచారం అందుకున్న బిజెపి పట్టణ అధ్యక్షుడు జింక చంద్రశేఖర్, బిజెపి నాయకుడు చెన్నా ఆదినారాయణ మృతుడు బీరే నాగరాజు ఇంటికి వెళ్లి మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జింక చంద్రశేఖర్ మాట్లాడుతూ నాగరాజు చేనేత మగ్గం వేస్తూ జీవనం గడిపేవాడని ఆయన మృతి చాలా బాధాకరమని తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి నాయకుడు చెన్నా ఆదినారాయణ 5000 రూపాయల ఆర్థిక సహాయమును ఆ కుటుంబానికి అందజేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి మంత్రి సత్య కుమార్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాగభూషణ, పోతుకుంట రాజు, కేశవ రంగా శీన, వన్నూరప్ప, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు