Monday, May 6, 2024
Monday, May 6, 2024

ప్రస్తుతానికి బూస్టర్‌ డోసు గురించి ఆలోచనే లేదు : ఐసీఎంఆర్‌

దేశంలోని ప్రజలందరికీ రెండు డోసుల టీకా ఇవ్వడమే తమ లక్ష్యమని, ప్రస్తుత దశలో బూస్టర్‌ డోసు గురించి ఆలోచించడం లేదని ఐసీఎంఆర్‌ డైరక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరామ్‌ భార్గవ్‌ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, డబ్ల్యూహెచ్‌వోకు కోవాగ్జిన్‌ డేటాను పూర్తిగా సమర్పించినట్లు తెలిపారు.దాన్ని డబ్ల్యూహెచ్‌వో పరిశీలిస్తోందన్నారు.త్వరలోనే కోవాగ్జిన్‌కు ఎమర్జెన్సీ అనుమతిపై డబ్ల్యూహెచ్‌వో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. డెంగీ వ్యాక్సిన్‌కు సంబంధించి విస్తృత స్థాయిలో ట్రయల్స్‌ నిర్వహించాలని భావిస్తున్నట్లు ్‌ తెలిపారు. ప్రస్తుతం మన దేశంలో కొన్ని డెంగీ స్ట్రెయిన్లపై అధ్యయనం సాగుతోందని, అయితే ఆ కంపెనీలు చాలా వరకు విదేశాల్లో తొలి దశ ట్రయల్స్‌ చేశాయని, భారత్‌లో మరింత విస్తృతంగా ట్రయల్స్‌ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img