స్పందన హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పుట్టపర్తి రోడ్, సాయి నగర్, సాయిబాబా గుడి వద్ద గల స్పందన హాస్పిటల్ లో నిర్వహించిన ఉచిత జనరల్ సర్జరీ వైద్య శిబిరమునకు విశేష స్పందనం రావడం జరిగిందని హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ నేతాజీ లాప్రోస్కోపిక్ సర్జన్ వారి ఆధ్వర్యంలో 94 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు అందించి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశామని వారు తెలిపారు. అదేవిధంగా షుగర్ బీపీ పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించామని తెలిపారు. శాస్త్ర చికిత్సలు అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అనుమతి వచ్చిన వారికి పూర్తిగా ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఉచిత పథకాలు లేని పేద ప్రజలకు రాయితీ ధరలలో ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో హెర్నియా, హైడ్రోసిల్, థైరాయిడ్, రొమ్ములో గడ్డలు, అల్సర్, ఫిస్టులా, ఫైల్స్ అపెండిక్స్, గాల్ బ్లాడర్ లో రాళ్లు, శరీరంపై గడ్డలు మొదలైన వాటిని పరీక్షించి చికిత్సలు కూడా అందించడం జరిగింది అని తెలిపారు. అత్యంత నైపుణ్యంతో లాప్రోస్కోపిక్ సర్జరీలు కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. తదుపరి ఇటువంటి శిబిరం ఉచితంగా నిర్వహించడం పట్ల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది దిల్దార్, బాబా ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత జనరల్ సర్జరీ వైద్య శిబిరమునకు విశేష స్పందన..
RELATED ARTICLES