చలన చిత్ర పరిశ్రమ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక వివరాలను అకాడమీ తెలియజేసింది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుక 2026 మార్చి 15న జరగనున్నట్లు అకాడమీ తెలిపింది. అయితే ఈసారి కొన్ని నూతన నిబంధనలను అకాడమీ ప్రవేశపెట్టింది. ఆస్కార్ పోటీ జాబితాను 2026 జనవరి 22న వెల్లడించనున్నట్లు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తెలిపింది. పలు కేటగిరీల్లో ఓటింగ్ విధానంలో మార్పులు చేసినట్లు వెల్లడించింది. నామినేట్ చేసిన ప్రతి మూవీని అకాడమీ సభ్యులు ఖచ్చితంగా చూస్తారని తెలిపింది. ఈసారి అచీవ్ మెంట్ ఇన్ కాస్టింగ్ అనే విభాగాన్ని ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. ఈ విభాగానికి రెండు దశల్లో ఓటింగ్ ప్రక్రియ ఉంటుందని తెలిపింది. తుది ఓటింగ్ ముందు కాస్టింగ్ డైరెక్టర్లకు కొన్ని రౌండ్ల టెస్టింగ్ ఉంటుందని వెల్లడించింది. ఈసారి కృత్రిమ మేధ (ఏఐ) ఉపయోగించి నిర్మించిన మూవీలను కూడా పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలిపింది. అయితే ఇది ఇతర మూవీలపై ప్రభావం చూపదని స్పష్టం చేసింది. ఏఐ మూవీల కంటే సాధారణ మూవీలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అకాడమీ వెల్లడించింది. లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్ లో ఈ అవార్డుల వేడుక జరగనుండగా, జనవరి 2025 నుంచి డిసెంబర్ వరకు విడుదలైన మూవీలు ఆస్కార్ అవార్డులకు పోటీ పడనున్నాయి. అయితే మ్యూజిక్ విభాగంలో మాత్రం తుది గడువు ఈ ఏడాది అక్టోబర్ 15గా నిర్ణయించడం జరిగిందని తెలిపింది.
2026 ఆస్కార్ అవార్డులకు కొత్త నిబంధనలు
RELATED ARTICLES