కబడ్డీ కోచ్ పృథ్వి
విశాలాంధ్ర ధర్మవరం:: గుంతకల్లు రైల్వే క్రీడామైదనంలో జరిగిన 12వ రాష్ట్ర స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలలో ధర్మవరం ఆర్ డి టి క్రీడా మైదానంలో కబడ్డీ లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచిన ముగ్గురు క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక ఐనట్లు కబడ్డీ కోచ్ పృధ్వీ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంపిక ఐన క్రీడాకారులు ఎన్..ఉష, బి.నవ్య, పి..శ్రీనివాసులు ఎంపిక కావడం జరిగిందన్నారు. ఈ క్రీడాకారులు మేనెల 2 నుంచి 5 వరకు కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు అని తెలిపారు. . క్రీడాకారులు ఎంపిక పట్ల ఆర్ డి టి ఏటీఎల్ శ్రీనివాసులు, ఆర్డిటి కోచ్ పృద్వి, ఇతర కోచ్ లు క్రీడాకారులనీ అభినందన శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలకి ఎంపిక..
RELATED ARTICLES