హెడ్ మాస్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి
మూఢనమ్మకాలు లేని శాస్ర్తీయ సమాజమే జె వి వి లక్ష్యం – డాక్టర్ ఆదిశేషు
విశాలాంధ్ర ధర్మవరం; విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మతను వెలికి తీయడానికి చేసే ప్రయత్నమే యురేకా సైన్స్ ఎక్స్ పో అని గణేష్ మున్సిపల్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన యురేకా సైన్స్ ఎక్స్ పో విజేతల అభినందన సభ లో ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక నిర్వహించిన “ప్రయోగాల ఆన్లైన్ వీడియో కంటెస్ట్ యురేకా సైన్స్ ఎక్స్పో” లో మా పాఠశాలో విద్యార్థులు జిల్లా స్థాయిలో విజేతలు గా నిలవడం సంతోషంగా ఉందన్నారు . జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్సు సంబరాలతో పాటు సైన్స్ ప్రయోగాల వీడియో కాంటెస్ట్ యురేకా సైన్స్ ఎక్స్పో విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచనలను, దృక్పథాన్ని పెంచేందుకు ,శాస్త్రీయ పరిశోధనలకు నాంది పలికేందుకు దోహదపడుతుందన్నారు.ఈ సంధర్బంగా విజేతలు గా నిలిచిన డి.మేఘన, సి.తేజస్విని లను అభినందించారు.
జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు మాట్లాడుతూ
జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాలు లేని శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్నదనీ అన్నారు.
జన విజ్ఞాన వేదిక శాస్త్రీయ, నైతిక విలువలతో కూడిన విద్య కోసం, ఆరోగ్యం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం, స్వావలంబన కోసం కృషి చేస్తున్న సైన్స్ సంస్థ అని జెవివి అన్నారు . మానవాళి ఎదుర్కొనే ఆనేక సమస్యలకు పరిష్కారం చూపేది సైన్స్ మాత్రమేనన్నారు. నూతన విద్యావిధానం పీరుతో విద్యలో మూఢనమ్మకాలను చొప్పించే ప్రయత్నం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలన్నారు. దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందాలంటే పాఠశాలలు, కళాశాలల్లో అత్యాధునిక ప్రయోగశాలను అభివృద్ధి చేయాలన్నారు.ఈ మధ్య బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న అధికారులు, పాలకులు సైన్స్ పేరుతో సుడో సైన్స్ ను ప్రచారం చేస్తూ ప్రజల్ని అయోమయంలోకి, మూఢనమ్మకాల్లోకి నెట్టేస్తున్నారన్నారు.. దీనిని గమనించి ప్రశ్నించాల్సిన అవసరం వుందన్నారు.
ఈ కార్యక్రమంలో జేవీవీ పట్టణ ప్రధాన కార్యదర్శి వై నరేంద్ర బాబు, ఏ పి టీ ఫ్ నాయకులు రవీంద్రారెడ్డి, సైన్స్ ఉపాద్యాయులు శేఖర్, గోపి,వెంకటరముడు పాల్గొన్నారు.