వ్యాయామ ఉపాధ్యాయులు
విశాలాంధ్ర ధర్మవరం;; జూనియర్ కళాశాల వ్యాయామ విద్య నిర్వీర్యం కావడం దారుణమని జూనియర్ కళాశాల వ్యాయామ విద్య విద్యార్థుల పాలిట శాపంగా మారిందని వ్యాయామ ఉపాధ్యాయులు నాగేంద్ర ,కల్పనా, పద్మావతి, సరళ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు బాలుర కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ డైరెక్టర్ వారి ఆదేశాలను అనుసరించి, సర్ప్స్ టీచింగ్ పోస్టులుగా గుర్తించి 84 జూనియర్ కళాశాలలకు అవసరం నిమిత్తం పోస్ట్ బదలాయింపు పోస్ట్ చేయడానికి జోనల్ వారీగా చేయడానికి ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గతంలో కొన్ని కళాశాలలకు పోస్ట్ శాంక్షన్ కాకపోవడం అను సాకుతో బలోపేతమైన విద్యా వ్యవస్థ ఉన్న కళాశాల నుండి బదలాయింపు మార్పు చేయడం వలన ముఖ్యంగా వ్యాయామ విద్యను కళాశాల స్థాయిలో నిర్వీర్యం అయ్యే స్థితికు రావడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా జోన్స్ 1,2,3,4 లలో షిఫ్ట్ ప్రకారం ఆరు కన్వెన్షన్ ప్రకారము 193 మొత్తం 199 జోన్ 4 అయిన రాయలసీమ జిల్లాల ఎందరి జూనియర్ కళాశాలలో షిఫ్ట్ అండ్ కన్వర్షన్ గా మొత్తంగా 83 ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ లెక్చరర్స్ పోస్టును ఇతర సబ్జెక్టులకు కన్వర్షన్ చేయడానికి డైరెక్టర్ ఆదేశాలు అనుసరించి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మార్పులో భాగంగా ప్రత్యేకించి వెనుకబడిన రాయలసీమ ప్రాంత విద్యార్థులకు వ్యాయామ విద్య నుండి లభించే భవిష్యత్తు సౌకర్యాలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కావున విద్యాశాఖ డైరెక్టర్ సమీక్షించి విద్యార్థులకు తగు న్యాయం చేయడం కొరకై ఫిజికల్ ఎడ్యుకేషన్ లెక్చరర్ పోస్టులను యధాస్థితిగా కొనసాగించి న్యాయం చేయాలని వారు కోరారు. విద్యార్థుల భవిష్యత్తుకు మంచి బాటలు వేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు కూడా కోరుతున్నారని వారు తెలిపారు.
జూనియర్ కళాశాల వ్యాయామ విద్య నిర్వీర్యం కావడం దారుణం..
RELATED ARTICLES