విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల బ్రహ్మకుమారిస్ సంస్థలో ఆర్కే రాధా ఆధ్వర్యంలో ఘనంగా ధరిత్రి దినోత్సవ వేడుకలు నిర్వహించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పంచ తత్వాలలో ముఖ్యమైన తత్వం పుడమి ( భూమి) తల్లి అని తెలిపారు. ప్రతి ప్రాణికి సురక్షితంగా, స్వేచ్ఛగా, ఆనందంగా జీవించడానికి ఆధారమైనది భూమి అని తెలిపారు. అంతేకాకుండా ఈ సృష్టిలో మహా అద్భుతమైన శక్తిని కలిగిన తత్వం భూమి అని తెలిపారు. ఈ భూమాత తన భూగర్భములో సర్వ ఖజానాలను, సర్వ సంపదలను దాచుకున్న పుడుమ తల్లి భూమాత అని తెలిపారు. బంగారు చిరులను ఇచ్చేటువంటి బంగారు తల్లి భూమాత అని, నేటి మానవుడు ఇటువంటి పురమీతల్లిని దుర్వినియోగం చేస్తూ, స్వార్థపూరితమైన స్వలాభాల కోసం, పుడమితల్లిని రోదింప చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మానవుడు విషపూరితమైన ఆలోచనలతో పుడమి తల్లిని విషపూరితంగా కలుషితం చేస్తున్నారని తెలిపారు. అందుకే పుడమితల్లిని పునః శిలా యామానంగా, సంపన్నంగా సస్యశ్యామలంగా చేసేందుకు మానవుడు తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కావున మనమందరం మంచి సంకల్పంతో, ప్రకృతిని నిరుపయోగం చేయకుండా, నిస్వార్థమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడే అది సార్ధకం అవుతుందని తెలిపారు. మనమందరము ప్రకృతిని చెట్ల పై మామే కులమై ప్రకృతిని ప్రేమిస్తూ వాటిని పెంచుతూ ఈ ప్రపంచాన్ని నందనవనంగా మార్చుకోవాలని తెలిపారు. ఇందుకు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు కృషి ఉన్నప్పుడే మనము ప్రకృతిని కాపాడుకోగలమని వారు తెలిపారు.
ఘనంగా ధరిత్రి దినోత్సవ వేడుకలు.. బ్రహ్మకుమారి సంస్థ సిస్టర్ ఆర్కె రాధా
RELATED ARTICLES