ఉమ్మడి జిల్లా లేబర్ అసిస్టెంట్ కమిషనర్ సూర్యనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం;; కార్మిక చట్టాలు, లేబర్ కార్డు ఉపయోగాలు ప్రతి కార్మికుడు తెలుసుకోవలసిన అవసరం ఉందని ఉమ్మడి జిల్లా లేబర్ అసిస్టెంట్ కమిషనర్ సూర్యనారాయణ, ధర్మవరం లేబర్ ఆఫీస్ ఇంచార్జ్ నరేష్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో ఆఫీస్ నందు గల ఎన్జీవో హోమ్ లో కార్మిక చట్టాల అవగాహన సదస్సును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మిక చట్టాల గురించి, కార్మికులకు లేబర్ కార్డు చేయించుకోవడం వల్ల వాటి వల్ల ఉపయోగాలు, సంక్షేమ పథకాలు గురించి కార్మికులకు తెలియజేయడం జరిగింది అని తెలిపారు. కార్మిక చట్టాలు కార్మికుల శ్రేయస్సు కొరకు రూపొందించబడిందని తెలిపారు. కార్మికుల చట్టాలు కార్మికుల శ్రేయస్సుకు ఉపయోగపడతాయని తెలిపారు. కాబట్టి కార్మికులందరూ కూడా ఇటువంటి సభలో తెలుసుకున్న విషయాలను అందరికీ తెలిపినప్పుడే అది సత్ఫలితాలను ఇస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, పట్టణ సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ, ప్లంబర్ ఎలక్ట్రిషన్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, గోవిందరాజులు, అన్నం లక్ష్మీనారాయణ, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, నాగేంద్ర, తాజుద్దీన్, సుబ్బయ్య, మసూద్, చిన్న, రామకృష్ణ, సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
కార్మిక చట్టాలు, లేబర్ కార్డు ఉపయోగాలు తెలుసుకోవాలి..
RELATED ARTICLES