Tuesday, May 13, 2025
Homeఅంతర్జాతీయంకక్ష్యలోకి ద.కొరియా నిఘా ఉపగ్రహం

కక్ష్యలోకి ద.కొరియా నిఘా ఉపగ్రహం

సియోల్‌: దక్షిణ కొరియా నాల్గవ నిఘా ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఐదు సైనిక నిఘా ఉపగ్రహాల్లో నుంచి నాల్గో ఉపగ్రహాన్ని ఫ్లోరిడాలోని అమెరికా అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించి, నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా చేర్చినట్లు దక్షిణ కొరియా రక్షణ శాఖ మంగళవారం వెల్లడిరచింది. స్పేస్‌ ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా కేప్‌ కనావెరల్‌ స్పేస్‌ ఫోర్స్‌ సెంటర్‌ నుంచి ఈ ప్రయోగం జరిగినట్లు తెలిపింది. ప్రయోగించిన 15 నిమిషాల్లోగా నిర్ణీత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. తమ సాయుధ దళాలను మరింతగా బలోపేతం చేసుకోవడం కోసం, స్వతంత్రంగా నిఘా సామార్థ్యం పెంచుకునేందుకు ఈ ఉపగ్రహాలు దోహదమవుతాయని మంత్రిత్వశాఖ వెల్లడిరచింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు