Wednesday, April 23, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివర్క్ అడ్జస్ట్మెంట్ ఉపాధ్యాయులకు ఘన సన్మానం..

వర్క్ అడ్జస్ట్మెంట్ ఉపాధ్యాయులకు ఘన సన్మానం..

విశాలాంధ్ర- ధర్మవరం;; ప్రభుత్వ ఆదేశాల మేరకు గత సంవత్సరం 10వ తరగతి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్ఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల లో వర్క్ అడ్జస్ట్మెంట్ టీచర్లుగా ఐదు మంది ఉపాధ్యాయులను ఎంఈఓ ద్వారా నియామకాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆ ఐదు మంది ఉపాధ్యాయులు తమదైన శైలిలో పదవ తరగతి విద్యార్థులకు చక్కటి విద్యను అందిస్తూ, మంచి నడవడికలు కూడా నేర్పడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో వీరు చేసినటువంటి సేవను, ప్రతిభను దృష్టిలో ఉంచుకొని ఐదు మంది ఉపాధ్యాయులైన గోవిందు, నాగేంద్ర కుమార్, కవిత ,సుజాతమ్మ, అశ్విని లను హెడ్మాస్టర్ ఉమాపతి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో పూల మాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ ఉమాపతి మాట్లాడుతూ పదవ తరగతి విషయంలో, మిగిలిన తరగతుల విషయంలో ఈ ఐదు మంది ఉపాధ్యాయులు చేసిన సేవలు ఎంతో మేలు చేయడం జరిగిందని తెలిపారు. వీరిని సన్మానించడం మా యొక్క బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం వర్క్ అడ్జస్ట్మెంట్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ మాకెంతటి గౌరవాన్ని ఇచ్చి సన్మానించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు