పాఠశాల డైరెక్టర్ పృథ్వీరాజ్
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని యశోద కాన్సెప్ట్ స్కూలులో పదవ తరగతి పరీక్షా ఫలితాలలో విజయదుందిబి మోగించిందని డైరెక్టర్ పృథ్వీరాజ్ ప్రిన్సిపాల్ అనూప్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పాఠశాలలో 106 మందిలో 590 మార్కులకు పైగా ముగ్గురు విద్యార్థులు, 580 మార్కులకు పైగా 24 మంది, 540 మార్కులకు పైగా 48 మంది విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించడంతో పాఠశాల యాజమాన్యం విద్యార్థులను తల్లిదండ్రులను ఆహ్వానించి విజయోత్సవ సభ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రిన్సిపాల్ తో పాటు ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.