Friday, April 25, 2025
Homeజిల్లాలుఅనంతపురంగ్రామ ప్రజల భాగస్వామ్యంతోనే పంచాయతీల అభివృద్ధి సాధ్యం

గ్రామ ప్రజల భాగస్వామ్యంతోనే పంచాయతీల అభివృద్ధి సాధ్యం

చాబాల గ్రామ సర్పంచ్ మల్లెల జగదీష్

విశాలాంధ్ర, ఉరవకొండ ( అనంతపురం జిల్లా) : ప్రజల యొక్క భాగస్వామ్యంతోనే పంచాయతీల అభివృద్ధి సాధ్యమని అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాల గ్రామం పంచాయతీ సర్పంచ్ మల్లెల జగదీష్ అన్నారు. గురువారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జగదీష్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల ద్వారానే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుంది కావున గ్రామ ప్రజలందరూ గ్రామపంచాయతీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎర్రి స్వామి, మాజీ ఉప సర్పంచ్ బండారు పరంధామ, అంబేద్కర్ గురుకుల పాఠశాల వైస్ చైర్మన్ మండల చంద్రశేఖర్, స్టోర్ డీలర్ నరసింహులు, రాంబాబు, మూర్తి, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, వీఆర్వో సురేంద్ర, డిజిటల్ అసిస్టెంట్ జ్యోతి, విలేజ్ సర్వేయర్ భాను, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రమోద్, వీఆర్ఏ గంగాధర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు