Friday, April 25, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅత్యధిక మార్కులు కైవసం చేసుకున్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి పి.వన్నూర్ వలి..

అత్యధిక మార్కులు కైవసం చేసుకున్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి పి.వన్నూర్ వలి..

హెడ్మాస్టర్ శైలజ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షా ఫలితాలలో పి వన్నూర్ వలి 526 మార్కులతో మంచి ప్రతిభ కనబరచడం జరిగిందని హెడ్మాస్టర్ శైలజా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పాఠశాలలో 80 మంది విద్యార్థులు గాను 24 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా 30 శాతము నమోదు కావడం జరిగిందన్నారు. తదుపరి ఎం. జ్ఞానేంద్ర 514 మార్కులు, పి. నవీన్ కుమార్ 504 మార్కులతో కైవసం చేసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తీర్ణులైన వారందరికీ కూడా హెచ్ఎం తో పాటు ఉపాధ్యాయులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

మోడల్ స్కూల్లో ప్రతిభ చాటిన పదవ తరగతి విద్యార్థులు;; పట్టణంలోని మోడల్ స్కూల్లో (ఆదర్శ పాఠశాల) అత్యధిక మార్కులతో పదవ తరగతి విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగిందని హెడ్మాస్టర్ పద్మశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పాఠశాలలో 98 మంది విద్యార్థులకు 76 మంది ఉత్తీర్ణులు కావడం జరిగిందని, దీంతో 78 శాతం నమోదు కావడం జరిగిందన్నారు. అత్యధిక మార్కులతో జి స్వాతి 586 మార్కులు, పి.రమ్యకుమారి 580 మార్కులు, జె. రాంచరణ్ 578 మార్కులు, ఓ. జాన్ మోషే కైవసం చేసుకోవడం జరిగిందన్నారు. అనంతరం హెడ్మాస్టర్ తో పాటు ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ చైర్మన్, తల్లిదండ్రులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు