Saturday, April 26, 2025
Homeఆంధ్రప్రదేశ్ఏపీకి కేంద్రం నిధుల‌ విడుద‌ల

ఏపీకి కేంద్రం నిధుల‌ విడుద‌ల

15వ ఆర్థిక సంఘం నిధుల‌ విడుద‌ల
2024-25 ఆర్థిక సంవత్స‌రానికి నిధుల‌ను విడుద‌ల చేస్తూ ఉత్త‌ర్వులు జారీ
రాష్ట్ర ప్ర‌భుత్వ‌ ఖ‌జానాలో రూ. 1121.20 కోట్ల నిధులు జ‌మ‌

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధుల‌ను విడుద‌ల చేసింది. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్స‌రానికి సంబంధించిన నిధుల‌ను విడుద‌ల చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వ‌ ఖ‌జానాలో రూ. 1121.20 కోట్ల నిధులు జ‌మ‌య్యాయి.ఇందులో 70 శాతం గ్రామ పంచాయ‌తీల‌కు, మండ‌ల ప‌రిష‌త్‌ల‌కు 20 శాతం, జిల్లా ప‌రిష‌త్‌ల‌కు 10 శాతం చొప్పున నిధుల‌ను కేటాయించ‌నున్నారు. జ‌నాభా ప్రాతిప‌దిక‌న ఆయా గ్రామ పంచాయ‌తీల బ్యాంక్ ఖాతాల‌కు ఆర్థిక శాఖ అనుమ‌తితో పంచాయ‌తీ రాజ్ శాఖ నిధుల‌ను జ‌మ చేయ‌నుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు