విశాలాంధ్ర ధర్మవరం;; మే 20న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెకు సంబంధించిన బుక్లెట్స్ ను సిఐటియు నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ జే వి రమణ, జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ ఆదిశే షూ, చేనేత కార్మిక సంఘం నాయకులు ఎస్ .హెచ్ భాష ,టి ఆ యుబ్ ఖాన్, మాట్లాడుతూ 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలను నాలుగు కార్మిక కోడలుగా కుదించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక రకాల ప్రయత్నాలు జరుపుతున్నదని మండిపడ్డారు. కార్మిక చట్టాలను కుదించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్ని ప్రయత్నాలకు రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయన్నారు. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం కార్మిక చట్టాలకు సంబంధించిన బృందానికి మన రాష్ట్ర ప్రభుత్వం తిరుపతిలో ఆతిథ్యం కూడా ఇచ్చి, కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు తెలపడం జరిగినదని ,29 కార్మిక చట్టాలను కుదించి నాలుగు కార్మిక కోడ్ లుగా అమలు చేస్తే కార్మికులకు కనీస వేతన చట్టం అమలయ్యే పరిస్థితి ఉండదని తెలిపారు.ఎనిమిది గంటల పని దినానికి స్వస్తి పలుకుతున్నారని, వేలాదిమంది కార్మికులు పోరాటాలు నిర్వహించి, ప్రాణాలర్పించి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినం లేకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.కావున కార్మిక హక్కులు కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మే 20 తారీకున దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కార్మికులకు పిలుపు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎల్ ఆదినారాయణ, ఎస్ హైదరాబాద్, తదితరులు పాల్గొన్నారు.
మే 20న దేశవ్యాప్త సమ్మె బుక్ లెట్స్ విడుదల… సిఐటియు
RELATED ARTICLES