న్యాయమూర్తి టి హరిత
విశాలాంధ్ర- అనంతపురం : రోగుల పట్ల ప్రేమతో వ్యవహరించాలని న్యాయమూర్తి, ఫ్యామిలీ కోర్ట్ కమ్ పII అదనపు జిల్లా సెషన్స్ కోర్టు టి హరిత పేర్కొన్నారు. రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్, ఆర్య వైద్య ఫార్మసీ కోయంబత్తూర్ ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్యంలో క్యాన్సర్ చికిత్స, నిరంతర వైద్య విద్యా కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక శ్రేయాస్ గ్రాండ్ హోటల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామా రాష్ట్ర అధ్యక్షుడు బండారు నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న న్యాయమూర్తి టి హరిత మాట్లాడుతూ.. పూర్వము అన్నిరకాల జబ్బులకు ఆయుర్వేద వైద్యం లొనే తగించుకొనే వారని, సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యమని, వైద్యులకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను రాష్ట్రీయ ఆయుర్వేదిక్ మెడికల్ అసోసియేషన్ వారు నిర్వహించటాన్ని హర్షించారు. వైద్య వృత్తి పవిత్రమని, వైద్యులు రోగులపట్ల ప్రేమతో వ్యవహరించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ ఆయుష్ వైద్యులందరూ ఎప్పటికప్పుడు నిత్య విద్యార్థిగా పరిశోధనలు చేయాలన్నారు. ఎస్కే యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగాధిపతి గౌరవ అతిథిగా పాల్గొన్న మురళీధర్ రావు మాట్లాడుతూ… ఆయుర్వేద వైద్యంలో వేళ ఏళ్ల క్రితమే కాన్సర్ లాంటి రోగాలు రాకుండా నివారించే పద్ధతులు ఆయుర్వేదం లో ఉపయోగించే అన్ని మూలికలపై అనేక పరిశోధనలు జరిగాయన్నారు. కొన్ని మూలికలు , ఔషధాలు సమర్ధవంతంగా కాన్సర్ చికిత్స లో ఉపయోగ పడతాయని తెలియ చేశారు. డాక్టర్ బండారు నాగేశ్వర రావు మాట్లాడుతూ… కాన్సర్ రోగులకు సైడ్ ఎఫెక్ట్స్ లేని చికిత్స లు ఆయుర్వేదంలో ఉన్నాయని, ఆయుష్ వైద్యులను సంఘటితం చేయటానికి రామా సంస్థ కృషి చేస్తోందన్నారు. యువ వైద్యులు తమ తమ వైద్యం లో నే రాణించటానికి కృషి చేయాలన్నారు. కొత్తగా వైద్యవృత్తి లోకి వచ్చిన యువ వైద్యులకు రామా అసోసియేషన్ వైద్యులు ఉచితంగా మెళకువలు నేర్పుతామన్నారు. రామా దక్షిణాది రాష్ట్రాల కోఆర్డినేటర్ డాక్టర్ వీరబోయిని నాగేశ్వర రావు మాట్లాడుతూ… ఆయుర్వేదం లో జబ్బులు తగ్గించ టానికే కాక , జబ్బులు రాకుండా నివారించటానికి రక రకాల చికిత్స లు ఉన్నాయన్నారు. వైద్యులు సంప్రదాయ పద్దతులే కాకుండా ఆధునిక పరికరాలను ఉపయోగించి రోగులకు మెరుగైన వైద్యం అందించవచ్చు అన్నారు, ఆన్లైన్ ద్వారా మారుమూల లో ఉన్న ప్రజలకు కూడా ఆయుర్వేద వైద్యాన్ని అందించవచ్చు అన్నారు. విశ్రాంతి ప్రొఫెసర్ డా. ఎం. భాస్కరరావు మాట్లాడుతూ…తమ
హాస్పిటల్ లో చికిత్స చేసిన కాన్సర్ పేషంట్ల వివరాలను వైద్యులకు తెలియచేయటమే కాకుండాన ఆయుర్వేదం లు బంగారు భస్మం లాంటి ఔషధాలు కాన్సర్ ని అరికడుతాయని ప్రపంచ వ్యాప్తంగా అనేక రెసెర్చ్ ల ద్వారా నిరూపించబడిందన్నారు. ఆయుర్వేద చికిత్స ద్వారా కీమో థెరపీ తరువాత వచ్చే దుష్పరిమానాలను తగ్గించవచ్చని అనేక విషయాలు తెలియ చేశారు.
డా. సోమిత్ కుమార్ డ డైరెక్టర్ఏ వి పి రీసర్చ్ ఫౌండేషన్ కోయంబొతూరూ లో ఉన్న అతిపెద్ద ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో కాన్సర్ వ్యాధి గ్రస్తులకు వారి సంస్థ ద్వారా తాయారయ్యేంఔషధాల గురించి వివరించారు.
డా. ఎం. గోపీ కృష్ణ, ఎం డి(రస శాస్త్ర) ఉ చైర్మన్ మరియు సహ-స్థాపకులు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద డ రస శాస్త్ర వీరు ఆయుర్వేద రసౌషధాలతో క్యాన్సర్ పేషంట్లకు ఎలని చికిత్స లు చేయవచ్చో వైద్యులకు తెలియ చేశారు.
శ్రీ సురేష్. దాకావరపు సి ఈ ఓ, డిజ్బి ప్రైవేట్ లిమిటెడ్ వీరు ఆయుష్ వైద్యులను దేశవ్యాప్తంగానే కాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలతో వైద్యులు ఆన్లైన్ లో సలహాలు ,సూచనలు, చికిత్స లు.అందించటానికి ప్రపంచం లో మొట్ట మొదటి సాఫ్ట్ వేర్ అందుబాటులోకి తీసుకొస్తున్నాము అనింతేలియచేశారు.
డా. శంకర్ మహదేవ్, ఎం ఎస్ (ఆయు) ఉ సాసా ఆయుర్వేద మెడికల్ కాలేజ్, గుత్తకల్ వీరు త్రిఫలములు కాన్సర్ ఎలా నియంత్రణలో ఉంచుకొన వచ్చో తెలియచేశారు.డా. రహీమ్ సుల్తానా ఉ ప్రిన్సిపల్, పతంజలి మహర్షి న్యాచురోపతి డ యోగా మెడికల్ కాలేజ్, గుంతకల్లు మాట్లాడుతు నాచురోపతి లో క్యాన్సర్న్రాకుండా కాలాడుకొనే ఒద్దతులను వివరించారు
. డా. పోగుల కుమారయ్య ఉ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూం అనేక జబ్బులకి ఆయుర్వేదం లో చక్కని పరిస్కారా మార్గాలున్నాయనించెప్పారు.
డా. నల్లపాటి తిరుపతి నాయుడు ఉ ఉపాధ్యక్షుడు మాట్లడుతూ… ఆయుష్ వైద్య విధానాలు దీర్ఘ రోగాలకే కాకుండా సాధారణ జబ్బులకి కూడ తక్షణ ము తగించవాక్కువహాని చెప్పారు, ఆయుష్ వైద్యలు సంఘటింగా ఉంటే అనేక ఉపయోగాలుంటాయని రమా ఆసోసియేషన్ ద్వారా ఇలాంటి మరిన్ని శిక్షణా కార్యక్రమలను నిర్వహిస్తామని తెలియచేశారు.
కర్నూలు నుంచి డాక్టర్ పద్మనాభ రెడ్డి వైద్యుల సేవ దృక్పథంతో సేవాలందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యులు బి గోపాల్,డా. గుదురు రవి కుమార్, డా.భూమి నరసింహ రెడ్డి, . డా.గౌరి శంకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి,. శ్రీనివాస నాయక్ జిల్లా అధ్యక్షుడు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు, మరియు సిబ్బంది పాల్గొన్నారు.