Monday, April 28, 2025
Homeజిల్లాలుఅనంతపురంపెన్నాహోబిలం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్లు విడుదల

పెన్నాహోబిలం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్లు విడుదల

మే 9 నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాలు 17న రథోత్సవం

విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను సోమవారం ఆలయ ఆవరణలో విడుదల చేశారు. మే 9 నుంచి 20వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి సాకే రమేష్ బాబు తెలిపారు. రథోత్సవం మే 17న జరుగునున్నట్లు తెలిపారు. మే 9 వ తేదీన శ్రీవారి ఉత్సవమూర్తులను ఆమిద్యాల గ్రామం నుంచి పెన్నోహోబిలం తీసుకురావడం జరుగుతుందని 10న ప్రాకారోత్సవం 11న ఉదయం సింహ వాహనోత్సవం సాయంత్రం చంద్రప్రభ వాహనోత్సవం 12న గోవాహనోత్సవం మరియు శేష వాహనోత్సవం 13న హంస వాహనోత్సవం, 14న హనుమంతు వాహనోత్సవం, 15న గరుడు వాహనోత్సవం మరియు రాత్రి స్వామివార్ల కళ్యాణోత్సవం 16న సూర్య ప్రభ వాహనోత్సవం, మరియు ఐరావతి వాహనోత్సవం 17న బ్రహ్మ రథోత్సవం, 18న అశ్వ వాహనం, 19న ధ్వజ అవరోహణం, మరియు శ యనోత్సవం, 20న ఉత్సవ విగ్రహాలు పె న్నో బిలం నుంచి ఆమిద్యాల గ్రామానికి వెళ్లే కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని కార్య నిర్వహణ అధికారి రమేష్ బాబు తెలిపారు. ఈ పోస్టర్ల విడుదల కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ద్వారక నాథా చార్యులు , తెలుగుదేశం పార్టీ నాయకులు విజయ భాస్కర్, మాజీ ఎంపీపీ సుంకరత్నమ్మ, మాజీ జెడ్పిటిసి సభ్యులు గుర్రం సుధాకర్, మాజీ సర్పంచ్లు గోవిందు, వెంకటేశులు, ఆ పార్టీ నాయకులు రాంబాబు, బొక్కసం రాజశేఖర్, వరప్రసాద్, వార్డు సభ్యులు రామాంజనేయులు, సూరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు