Monday, April 28, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజమ్మూ కాశ్మీర్లో మృతి చెందిన వారికి నివాళులర్పించిన వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మాసపల్లి సాయికుమార్

జమ్మూ కాశ్మీర్లో మృతి చెందిన వారికి నివాళులర్పించిన వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మాసపల్లి సాయికుమార్

విశాలాంధ్ర -ధర్మవరం : ఇటీవల పహల్దాలో హిందువులను టార్గెట్ చేసి యాత్రికులపై దాడి చేయడం ఏమైనా చర్య అని తెలుపుతూ, అక్కడ మృతి చెందిన వారికి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మాసపల్లి సాయికుమార్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ దాడి హేయమైన చర్య అని తెలిపారు. ఉగ్రవాదుల దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు తెలిపారు. ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ వారు మౌనం పాటిస్తూ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రధానమంత్రి ఇటువంటి దాడులు చేసిన వారిపైన తీవ్రంగా పరిగణిస్తూ వాళ్లను కఠినంగా శిక్షించాలని వారు తెలిపారు. తూటాకు తగిన సమయంలో భారత్ తప్పక సమాధానం ఇస్తుందని వారు స్పష్టం చేశారు. ఉగ్రదాడికి దారి తీసిన లోపాలు అవి పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇప్పటికే భారత దేశంలో దేశ ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నారని తెలిపారు. మరణించిన కుటుంబాలకు చేయూత ఇస్తూ ఆదుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు