గ్రంథాలయ అధికారి ప్రతాప్ రెడ్డి
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన తరగతులను విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఉరవకొండ గ్రంథాలయ అధికారి ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఉరవకొండ లో సోమవారం వేసవి శిక్షణా తరగతుల ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 28 నుండి జూన్ 6 వరకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ విజ్ఞాన శిబిరంలో విద్యార్థులకు ఉదయం 8గంటల నుండి 11 గంటలవరకు తరగతులు నిర్వహిస్తారని చెప్పారు. ఈ తరగతులలో ముఖ్యం గా విద్యార్థులలో తెలుగు భాషాభివృద్ధి పెంపొందించేందుకు కథలు చదవడం, రాయడం, పుస్తకాలు చదవడం, విలువలు విద్య, స్పోకెన్ ఇంగ్లిష్, డ్రాయింగ్, పెయింటింగ్ పేపర్ క్రాఫ్ట్, డ్యాన్స్, చెస్, జికె, యోగ మొదలైన అంశాలను నేర్పిస్తారని ఆయన అన్నారు. రిసోర్స్ పర్సన్ నవీన్ విద్యార్థులకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చి అవగాహన కల్పిస్తారు అన్నారు. ఈ శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను ఈ శిక్షణ తరగతులకు పంపాలని తెలిపారు.