Monday, April 28, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా మానస నృత్య కళా కేంద్రం ఐదవ వార్షికోత్సవ వేడుకలు..

ఘనంగా మానస నృత్య కళా కేంద్రం ఐదవ వార్షికోత్సవ వేడుకలు..

నాట్య గురువు మానస

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని చెన్నకేశవ స్వామి దేవస్థానంలో మానస నృత్య కళా కేంద్రం వారి ఐదవ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని నాట్య గురువు మానస తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీనివాస కళ్యాణ నృత్య రూపకం ఒక గంట పాటు నిర్విరామంగా జరిగిందని తెలిపారు. మొత్తం 25 మంది చిన్నారులచే నృత్య ప్రదర్శన నిర్వహించామని తెలిపారు. తదుపరి ప్రముఖ నాట్య చారిని ముంగుర హరి నీ చేతులమీదుగా, అలాగే పెద్ది పోగు ఆనంద్, బాపనపల్లి వెంకట స్వామి చేతులు మీదుగా గురువు మానసను ఘనంగా సత్కరించడం జరిగిందని తెలిపారు. 25 మంది చిన్నారుల యొక్క నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది అని తెలిపారు. ఇంతటి గొప్ప అవకాశాన్ని పొందినందులకు మానస తన సంతోషంతో పాటు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో సోమశేఖర్, అలివేలు మంగగా గురువు మానస, లక్ష్మీదేవి గా హరిణి, అన్నమయ్యగా కె. ఎస్. కృష్ణ నిర్వహించడం జరిగిందన్నారు. మొత్తం మీద ఈ నృత్య ప్రదర్శన పట్టణ ప్రజలు, భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు