లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాలాచార్యులు
విశాలాంధ్ర ధర్మవరం;; గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో గల పేద ప్రజలకు మంచి కంటి చూపును ప్రసాదించడమే లయన్స్ క్లబ్ లక్ష్యము అని అధ్యక్షులు వేణుగోపాలాచార్యులు, కార్యదర్శి ఆకులేటి రమేష్ బాబు, కోశాధికారి ఉలవల నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో లయన్స్ క్లబ్ వారు ఉచిత కంటి చికిత్స శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి దాతగా కీర్తిశేషులు గూడూరు నాగయ్య జ్ఞాపకార్థం వీరి కుమారులు గూడూరు మోహన్ దాస్ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. లయన్స్ క్లబ్ దేశవ్యాప్తంగా పేద ప్రజలకు విశేషంగా సేవలను అందిస్తూ లక్షల సంఖ్యలో పేదలకు కంటి చూపును ప్రసాదించడం జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే ధర్మవరంలో 70 వేలకు పైగా పేదలకు కంటి చూపును ప్రసాదించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరాలు దాతల సహాయ సహకారములతో నిర్వహిస్తూ లయన్స్ క్లబ్ విజయపతంలో నడిచేందుకు సభ్యుల సహకారం మరువలేనిదని వారు తెలిపారు. ఈ శిబిరంలో 93 మంది కంటి రోగులు, వైద్య చికిత్సలను అందుకోగా అందులో 72 మందిని కంటి ఆపరేషన్లకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. వీరందరికీ ఉచిత ఆపరేషన్లతో పాటు, ఉచితంగా అద్దాలను కూడా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం దాత తో పాటు పలువురు లయన్స్ క్లబ్ సభ్యులను కమిటీ ఘనంగా సత్కరించారు. కంటి టెక్నాలజీ డాక్టర్ నాగేంద్ర చే వైద్యులకు కంటి పరీక్షలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మెటికల కుళ్లాయప్ప, రాజగోపాల్, సాగా సురేష్, గోశే రాధాకృష్ణ, గవ్వల రాధాకృష్ణ, చందా నాగరాజు, పార్థసారథి, తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు మంచి కంటి చూపును ప్రసాదించడమే లయన్స్ క్లబ్ ముఖ్య లక్ష్యం..
RELATED ARTICLES