శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ నామా ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం;; ఉచిత రక్త నాళాల వైద్య శిబిరమునకు విశేష స్పందన రావడం శుభదాయకమని శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ నామాప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని మాధవ నగర్ లో గల శ్రీ సత్య సాయి భజన మందిరము నందు ఉచిత రక్తనాళాల వైద్య శిబిరమును నిర్వహించారు. అనంతరం నామ ప్రసాద్ మాట్లాడుతూ భారత దేశపు అతిపెద్ద వాస్కులర్ హాస్పిటల్-హైదరాబాద్ వారి సహకారంతో ఈ శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు. 5000 రూపాయల విలువైన రక్తనాళాల సర్జన్ కన్సల్టేషన్ అండ్ వైద్య పరీక్షలను ఉచితంగా రోగులకు అందించడం జరిగిందని తెలిపారు. పుట్టపర్తి బాబా ఆశీస్సుల మేరకు ఈ శిబిరము నిర్వహణ మాకెంతో ఆనందము, తృప్తిని ఇచ్చిందని తెలిపారు.ఈ శిబిరంలో రక్తనాళాల వైకల్యం, అర్తేరియా వెనస్ ఫిస్టులా, రక్తం గడ్డకట్టుట, కాళ్లు వాపు రావడం, ఉబ్బిన నరాలు, స్పైడర్, కాళ్లు లో రక్తం సరఫరా లేకపోవడం, సారియాసిస్, మెదడుకు తగినంత రక్త సరఫరా లేకపోవడం లాంటి జబ్బులకు వైద్య చికిత్సలను హైదరాబాద్ వైద్యులు డాక్టర్ సోమాచారి, డాక్టర్ స్వాతి లచే ఉచితంగా అందించడం జరిగిందన్నారు. ఇటువంటి శిబిరం నిర్వహణ పట్ల రోగులు కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసియన్ వాస్కులర్ హాస్పిటల్ హైదరాబాద్ జోనల్ ఇన్చార్జ్ సురేంద్ర, బాబా సేవకులు చంద్రశేఖర్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఉచిత రక్త నాళాల వైద్య శిబిరముకు విశేష స్పందన రావడం శుభదాయకం..
RELATED ARTICLES