Monday, April 28, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమీ విజయం మీ కృషితోనే - మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు

మీ విజయం మీ కృషితోనే – మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు

విశాలాంధ్ర -ధర్మవరం ; మీ విజయం మీ కృషితోనే ఫలితం ఉంటుందని, నిజాయితీతో ప్రయత్నించండి – బ్రోకర్ల మాయలో పడవద్దు అని, మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీ కలను మీరు సాకారం చేసుకోవాలని, స్వయంకృషితోఉద్యోగం పొందాలని తెలిపారు.
ధర్మవరం నియోజకవర్గంలో అక్రమాలకు ఆస్కారం లేదు అని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదలైన ఈ శుభ సందర్భంలో, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసేందుకు సిద్ధమవుతున్న యువతీ యువకులకు, మన ప్రియతమ నాయకులు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు సత్యకుమార్ తరపున, మంత్రి నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నోటిఫికేషన్స్ వెలువడిన నేపథ్యంలో, కొంతమంది దళారులు, బ్రోకర్లు “మేము మంత్రితో మాట్లాడతాం, ఉద్యోగాలు ఇప్పిస్తాం” అంటూ డబ్బులు తీసుకునే అవకాశముందని హెచ్చరించారు. ఎవరూ కూడా వారి మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ పోటీ పరీక్షలు పూర్తిగా ట్రాన్స్పరెంటుగా, మెరిట్ ఆధారంగా జరుగుతాయని వారు స్పష్టం చేశారు. మీరు మీ చదువుతో, మీ కృషితో ఉద్యోగాలు సాధించాల్సిన అవసరం ఉందని, దళారీలను నమ్మకుండా స్వయంకృషితో విజయాన్ని అందుకోవాలని కోరారు. అదే విధంగా, మంత్రి కార్యాలయం పేరు చెప్పి డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తులు, అధికారులను భ్రష్టుపట్టించే ప్రయత్నాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటి వ్యక్తుల గురించి వెంటనే మాకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.ల్యాండ్ గ్రాబింగ్ వంటి అక్రమ కార్యకలాపాల్లో ఎవరైనా మంత్రి పేరు ఉపయోగించినా, తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. అవిశ్రాంతంగా ప్రజలకు సేవ చేయడం మాత్రమే మంత్రి కార్యాలయ ధ్యేయమని, డబ్బుకు ముడిపడి చేసే వ్యవహారాలకు చోటు లేదని స్పష్టం చేశారు.
చివరిగా, మళ్లీ ఒకసారి యువతీ యువకులకు, వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి దళారీల మాయలో పడకండి, నిజాయితీతో ప్రయత్నించి విజయాన్ని సాధించండి. ఏవైనా అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే మాకు తెలియజేయాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు