చీఫ్ ఆర్బిటర్ ఆదిరత్నకుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రస్థాయి పోటీలకు గాను అండర్-9 క్రింద బాలురు బాలికలకు శ్రీ సత్యసాయి జిల్లా చదరంగం ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు చీఫ్ ఆర్పిటర్ ఆది రత్న కుమార్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మే ఒకటవ తేదీన పట్టణంలోని కళాజ్యోతిలో ఈ పోటీలు నిర్వహించబడుతాయని తెలిపారు. ఈ పోటీలో పాల్గొనేవారు తమ వెంట జనన ధ్రువీకరణ పత్రముతో హాజరుకావాలని తెలిపారు. జిల్లాస్థాయిలో ఎంపికైన వారు రాష్ట్రస్థాయిలో విజయవాడ నందు మే మూడవ తేదీ నాలుగవ తేదీన పాల్గొనాలని వారు తెలిపారు. ఓపెన్ అండర్ -9 కేటగిరి నందు ఇద్దరు, బాలికలు అండర్ -9 ఇద్దరినీ ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు మే 1వ తేదీన ఉదయం 11 గంటలకు నమోదు చేసుకోవాలని జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి నాగార్జున తెలిపారు. ప్రవేశ రుసుము 300 రూపాయలు ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9985896901 కు గాని 9177032075కు గాని సంప్రదించాలని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ఆసక్తి గల క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
జిల్లాస్థాయిలో చదరంగం ఎంపిక పోటీలు
RELATED ARTICLES