Wednesday, April 30, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంతవరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తాం..

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంతవరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తాం..

డిపో సెక్రటరీ మధుసూదన్
విశాలాంధ్ర ధర్మవరం; నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంతవరకు రిలే నిరాహార దీక్షలను ఆపమని డిపో సెక్రెటరీ కె.మధుసూదన్ తెలిపారు. ఈ సందర్భంగా మొదటిరోజు ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వి రమణ హాజరు కావడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నిరాహార దీక్ష శిబిరంలో జోనల్ ఉపాధ్యక్షులు బి ఎన్ శేఖర్, డిపో కార్యదర్శి మధుసూదన్, గ్యారేజ్ కార్యదర్శి హరికృష్ణ, శ్రీనివాసులు, మంజునాథ్, గోపాల్ ,అహ్మద్ నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. దీక్షలో పాల్గొన్న వారందరికీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమణ పొలహారం వేసి అభినందనలు తెలియజేశారు. ఉద్యోగుల ఉద్యోగ భద్రత సర్కులర్ అన్ని డిపాలలో వెంటనే అమలు చేయాలని, అక్రమ సస్పెన్స్ ను రిమూవల్స్ ఆపాలని, గత నాలుగు సంవత్సరాలుగా ఆగిపోయిన పదోన్నతులను వెంటనే నిర్వహించాలని తెలిపారు. ఈ హెచ్ ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని కొనసాగించాలని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీలో మాదిరిగానే క్యాడర్ స్ట్రెంత్ అమలు చేయాలని, నైట్ అవుట్ అలవెన్స్లను 150 రూపాయల నుండి 400 రూపాయలకు పెంచాలని, ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వమూ లేదా సంస్థ ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలని, అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులకు ఓడీలను కేటాయించాలని వారు తెలిపారు. ఉద్యోగుల అనారోగ్య సెలవులకు పూర్తి జీతం చెల్లించాలని, డబుల్ డ్యూటీల నగదును పెంచాలని, కార్యాలయ సిబ్బంది దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని, పారదర్శకమైన ట్రాన్స్ఫర్ పాలసీని అమలు చేయాలని, ఉద్యోగుల అవసరాన్ని బట్టి ఈఓఎల్ మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిపో కోశాధికారి వైవిఆర్ రెడ్డి, గ్యారేజీ అధ్యక్షుడు కుమార్, సీనియర్ నాయకులు మాధవ, ఎంసిజి.రావు, గోపాల్ అధిక సంఖ్యలో డిపో సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు