నియోజకవర్గ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు. స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ హరికృష్ణ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శ్రీ సాయి రామ్ ఐటిఐ కళాశాలలో ఈనెల 30వ తేదీన నిర్వహించే జాబ్ మేళా ను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలి అని నియోజకవర్గ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ బండ్ల హరికృష్ణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 30 వ తేదీన బుధవారం ఉదయం 9-00 గంటలకు నిర్వహించబడుతుందని తెలిపారు.ఈ జాబ్ మేళాలో దాదాపు 10 కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని, నిరుద్యోగ యువతీ , యువకులు సద్వినియోగం చేసుకొని ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలకాలని తెలిపారు. ఈ మెగా జాబ్ మేళా లో బహుళ జాతీయ 10 కంపెనీలు పాల్గొనుచున్నాయని , వాటి ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు ఇంటర్వూలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. మెగా జాబ్ మేళాలో హూడాయి మోటార్స్, టాటా ఎలక్ట్రానిక్స్, కే ఐ ఎం ఎల్, యాక్ట్, ఇంజి ఆటో కాంపోడేట్స్, డీఎస్సీ ఈ, ఎల్ ఎం ఎస్ లాంటి బహుళ జాతీయ కంపెనీలు పాల్గొనుచున్నాయన్నారు. ఈ మెగా జాబ్ మేళాలో హాజరు అయ్యే నిరుద్యోగ యువతీ,యువకులు విద్యార్హతలు పదవ తరగతి,ఇంటర్, ఐ.టి.ఐ, డిప్లొమా,బి. ఫార్మసీ /ఎం ఫార్మసీ, నర్సింగ్ / ఎనీ డిగ్రీ , ఎనీ బి.టెక్, పి.జి, చదివిన వారు అర్హులని తెలిపారు. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులు అర్హులని,ఈమెగా జాబ్ మేళా లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి నెలకి రూ 10 వేల నుండి 40 వేల వరకు జీతం ఉంటుందని తెలియజేశారు.ఈ ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా విద్యార్హత పత్రాలు జిరాక్స్,ఆధార్ కార్డ్,రెండు ఫోటోలతో అర్హత కలిగిన నిరుద్యోగ యువతి,యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు,9182288465 ఫోన్ నంబర్స్ కు సంప్రదించాలని తెలియజేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు తాము తెలిపిన మెయిల్ లో కూడా రిజిస్టర్ చేసుకొని అవకాశం ఉందని తెలిపారు.
30న జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోండి..
RELATED ARTICLES