విశాలాంధ్ర -ధర్మవరం; మండల పరిధిలోని మల్లేనిపల్లిలో చిరుత సర్కరిస్తున్నట్లు మంగళవారం వివిధ వాట్సాప్ లలో వచ్చే వార్తలు పూర్తిగా అవాస్తవమని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అక్కులప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ గ్రూపుల్లో వస్తున్నా వాటిని ఆధారంగా చేసుకొని తాను మల్లేనిపల్లి గ్రామంలో వెళ్లడం జరిగిందని, అక్కడ గల రైతులను, ప్రజలను నేరుగా అడిగి తెలుసుకోవడం జరిగిందని, కనీసం అక్కడ చిరుత పులి సంచరించినట్టు ఆ పులి యొక్క పాదాల గుర్తులు కూడా లేవని వారు స్పష్టం చేశారు. కావున మల్యాన్ని పల్లి ప్రజలు భయపడినక్క లేదని, ధర్మవరం వెళ్లే రహదారిలో తోట దగ్గర కాపలా ఉన్న కుక్కను గాయపరిచిన విషయం కూడా అవాస్తమని వారు తెలిపారు.
చిరుత సంచారం అవాస్తవం.. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అక్కులప్ప వెల్లడి
RELATED ARTICLES