పాలీసెట్ కోఆర్డినేటర్, ప్రిన్సిపాల్ సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల, కే హెచ్.డిగ్రీ కళాశాల, మోడల్ స్కూల్, మున్సిపల్ బాలికల పాఠశాల, శ్రీనివాస డిగ్రీ కళాశాల కేంద్రాలలో పాలిసెట్ ప్రవేశ పరీక్షలు సజావుగా నిర్వహించడం జరిగిందని ప్రిన్సిపాల్ అండ్ కోఆర్డినేటర్ సురేష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఐదు పరీక్షా కేంద్రాలలో 1930 మంది దరఖాస్తు చేసుకోగా 1705మంది పరీక్షలకు హాజరు కావడం జరిగిందని తెలిపారు. మొత్తం ఐదు పరీక్ష కేంద్రాలలో 89 శాతము హాజరు కావడం జరిగిందని తెలిపారు.ఇందులో బాలురు 90 శాతము, బాలికలు 87 శాతము హాజరుకావడం జరిగిందని తెలిపారు. ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించినందుకు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు, చీఫ్ సూపర్డెంట్ లకు, సిబ్బందికి వారు కృతజ్ఞతలను తెలియజేశారు.
సజావుగా పాలీసెట్ ప్రవేశ పరీక్షలు..
RELATED ARTICLES