విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: ప్రభుత్వ పాలిటెక్నికల్ ప్రవేశ పరీక్ష బుధవారం అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిర్వహించగా పరీక్షకు మొత్తం 8910 పరీక్ష రాయవలసి ఉండగా..7908 మంది శాతం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపల్ సి. జయచంద్ర రెడ్డి తెలిపారు. బాలురు 4819 మంది, బాలికలు 3089 మంది పరీక్ష రాశారు. అనంతపురం పాలీసెట్ జిల్లా పరిశీలకుడు డా. ఎన్. ప్రసాద్, అనంతపురం టౌన్ పరిశీలకుడు వై సురేష్ పాల్గొన్నారు.