Thursday, May 1, 2025
Homeజిల్లాలుఅనంతపురంచాకలి ఐలమ్మ కాలనీలో మేడే

చాకలి ఐలమ్మ కాలనీలో మేడే

విశాలాంధ్ర- అనంతపురం : చాకలి ఐలమ్మ కాలనీలో మే డే కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరణ చేసి చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు సి లింగమయ్య మాట్లాడుతూ… ప్రపంచ కార్మికులారా ఏకం కావాలి శ్రమ దోపిడీని వ్యతిరేకిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల చిన్నచూపు చూస్తూ కార్మికులకు అన్యాయం జరిగిన పట్టించుకోని ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు కార్మికుల పక్షానే ఉంటామని లేనిపోని అబద్ధాలు చెబుతూ గద్దనెక్కినంక కార్మికులను మర్చిపోతున్నారన్నారు. కష్టజీవులు శ్రమజీవులు చేతి వృత్తి మీద ఆధారపడిన వృత్తి దారులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వృత్తిదారులను మోసం చేస్తున్నారన్నారు. కార్మికులు కర్షకులు కష్టజీవులు శ్రమజీవులు ఏకమవుతే ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోతాయి అని హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా కార్యదర్శి సివి హరికృష్ణ, చాకలి ఐలమ్మ కాలనీ సిపిఐ కార్యదర్శి నాగరాజు, నగర అధ్యక్షులు టిసి భూషణ, ఆలయ కమిటీ అధ్యక్షుడు చిన్న నారాయణస్వామి, బికేస్ ఉపసర్పంచ్ సివి లలిత ఐలమ్మ కాలనీ సహాయకార్యదర్శి సంజీవులు, శ్రీన ,లక్ష్మీనారాయణ, మారుతి, సురేష్, లక్ష్మీదేవమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు